ఈ విషయం తెలుసుకున్న మరో వర్గానికి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు అక్కడకు చేరుకుని నిర్మాణాలను కూల్చివేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన ఓ వ్యక్తి ట్రాక్టర్‌పై మహిళపై ఎక్కించి, తొక్కించాడు. ఆ తర్వాత వారిపై తండ్రీకుమారులు గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో నలుగురు అక్కా చెల్లెళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానికులు తక్షణం ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు... గ్రామానికి చేరుకుని నిందుతులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన గ్రామంలో కలకలం సృష్టించింది. ట్రాక్టర్‌తో తొక్కించడం, గొడ్డలితో దాడి చేయడానికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.