గులాబీ, అనగనగా ఒకరోజు రచయిత నడిమింటి నరసింగరావు కన్నుమూత

డీవీ

బుధవారం, 28 ఆగస్టు 2024 (16:21 IST)
writer Nadiminti Narasingrao
కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘గులాబీ’, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘అనగనగా ఒకరోజు’ సినిమాలతోపాటు పలు తెలుగు సినిమాలకు మాటల రచయిగా పనిచేసిన నడిమింటి నరసింగరావు (72) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో వున్న ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు.
 
గులాబీ, అనగనగా ఒక రోజు సినిమాలు ఎంతగా ఘన విజయం సాధించాయో అందరకి తెలిసిందే. ముఖ్యంగా ఆ సినిమాలోని డైలాగ్స్ కూడా విశేష అదరణని పొందాయి. నేటికీ యూ ట్యూబ్ లో ఆ డైలాగ్స్ కోసమే సినిమా చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతటి అద్భుతమైన డైలాగ్స్ ని రాసింది ఎవరో కాదు నరసింగరావు. 
 
కొన్ని రోజుల క్రితం నరసింగరావు తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో  కుటుంబ సభ్యులు హైదరాబాద్ సోమాజిగూడ లోని  యశోదా ఆస్పత్రి లో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో వారం రోజుల క్రితమే కోమాలోకి  వెళ్లిన ఆయన ఈ రోజు తుది శ్వాస విడిచారు. దీంతో  తెలుగు చిత్ర పరిశమ్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  నరసింగరావు కి  భార్య, కుమార్తె ఉన్నారు. పాతబస్తీ, ఊరికి మొనగాడు,కుచ్చికుచ్చి కూనమ్మా వంటి సినిమాలకి కూడా మాటల రచయితగా పని చేసారు
 
సినిమాల్లోకి రాక ముందు  బొమ్మలాట అనే  నాటకం ద్వారా మంచి గుర్తింపుని పొందిన ఆయన ఒకప్పుడు  దూరదర్శన్ ప్రేక్షకులని ఉర్రూతలూగించిన  తెనాలి రామకృష్ణ  సీరియల్‌కి కూడా  రచయితగా  చేసారు. అలాగే ఈ టీవీ లో ఫేమస్ సీరియల్స్ గా గుర్తింపు పొందిన వండర్ బోయ్, లేడీ  డిటెక్టవ్, అంతరంగాలు వంటి సీరియల్స్ కి  కూడా మాటలు అందించారు. నడిమింటి నరసింగరావు మృతికి  పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు