హ్యాపీ బర్త్ డే వన్ అండ్ ఓన్లీ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్

డీవీ

మంగళవారం, 22 అక్టోబరు 2024 (15:52 IST)
Prabhas
ప్రభాస్... ఈ ఒక్క పేరు బాక్సాఫీస్ తారకమంత్రమై పాన్ వరల్డ్ అంతటా మార్మోగుతోంది. టాలీవుడ్ లో హీరోలు పేరు తెచ్చుకోవడం చూస్తుంటాం కానీ టాలీవుడ్ కే పేరు తెచ్చిన స్టార్ హీరో ప్రభాస్. ఆయన నెంబర్ వన్ ఇండియన్ సూపర్ స్టార్ అని చెప్పేందుకు మాటలు కాదు ఆయన క్రియేట్ చేస్తున్న నెంబర్స్, రికార్డ్స్ తిరుగులేని నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ప్రభాస్ సినిమాల బాక్సాఫీస్ నెంబర్స్ ట్రేడ్ పరంగా ఒక స్కేలింగ్ అయితే ప్రభాస్ సినిమా వస్తుందంటే పిల్లల నుంచి పెద్దల దాకా థియేటర్స్ కు వెళ్లడం ఒక ఫినామినా. ఎప్పుడో ఒకసారి సినిమా చూస్తాం అనే మలి వయసు పెద్దలు కూడా ప్రభాస్ సినిమాకు థియేటర్స్ కు కదలడం ఆయన ఒక యూనివర్సల్ యాక్సెప్టెన్సీ ఉన్న స్టార్ అని తెలియజేస్తుంటుంది. అందుకే బాక్సాఫీస్ దగ్గర  డే 1 రికార్డ్స్, ఫస్ట్ వీక్ రికార్డ్స్, వరల్డ్ వైడ్ హయ్యెస్ట్ గ్రాస్, రికార్డ్ స్థాయి ఓవర్సీస్ కలెక్షన్స్ సాధ్యమవుతున్నాయి.
 
ప్రభాస్ చుట్టూ ఉన్న పాజిటివ్ వైబ్స్ ప్రేక్షకుల్ని ఇంతలా ఆకర్షిస్తున్నాయని అనుకోవచ్చు. సలార్ లో ప్రభాస్ హ్యూజ్ యాక్షన్ సీన్స్ చేసినప్పుడు ఆ కటౌట్ కు కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అనుకున్నారు ఆడియెన్స్. అదీ స్క్రీన్ ప్రెజెన్స్ లో ప్రభాస్ కున్న ఛరిష్మా. బాహుబలి నుంచి పాన్ ఇండియా జైత్రయాత్ర మొదలుపెట్టిన ప్రభాస్ ఆ తర్వాత సాహో, సలార్, కల్కి 2898ఎడి సినిమాలతో దిగ్విజయంగా వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నాడు. వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ రీజనల్ స్టార్స్ కే కాదు ఎంతోమంది బాలీవుడ్ స్టార్స్ కు కూడా ఒక నెరవేరని కల, సాధ్యం కాని ఫీట్. కానీ ప్రభాస్ అలవోకగా బాహుబలి 2, కల్కి 2898 ఎడి సినిమాలతో రెండు సార్లు థౌసండ్ క్రోర్ గ్రాస్ మూవీస్ చేశాడు. బాహుబలి 2 డే 1, 200 కోట్ల రూపాయలు వసూళు చేయడం ట్రేడ్ వర్గాలను అవాక్కయ్యేలా చేసింది. ఈ సినిమా కోసం ప్రభాస్ వెయ్యి రోజుల శ్రమ కలెక్షన్స్ రూపంలో రిజల్ట్ ఇచ్చింది. కల్కి 2898 ఏడి మూవీ 1100 కోట్ల రూపాయల గ్లోబల్ గ్రాస్ కలెక్షన్స్ చేయడం ప్రభాస్ రీసెంట్ గా క్రియేట్ చేసిన ఒక సెన్సేషన్. ప్రభాస్ బిగ్ హీరోనే కాదు బిగ్ టికెట్ హీరో అని ఈ బ్లాక్ బస్టర్స్ ప్రూవ్ చేస్తున్నాయి. 
 
ప్రభాస్ సినిమా అంటే ప్రొడ్యూసర్స్, ట్రేడ్ సెక్టార్ లో ఒక గట్టి నమ్మకం ఏర్పడింది. ఆయన సినిమాల మీద ఎంతైనా ఖర్చు పెట్టొచ్చు, ఆ పెట్టుబడికి ప్రభాస్ స్టార్ డమ్, బాక్సాఫీస్ స్టామినానే పూచీ. అందుకే వందల కోట్ల రూపాయలతో బడ్జెట్ తో ప్రభాస్ భారీ పాన్ ఇండియా సినిమాలు నిర్మిస్తున్నాయి ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌసెస్. మారుతి డైరెక్షన్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ది రాజా సాబ్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ నిర్మిస్తున్న సలార్ 2, సందీప్ వంగా దర్శకత్వంలో టీ సిరీస్ నిర్మిస్తున్న స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా...ప్రభాస్ చేస్తున్న హ్యూజ్ ప్రాజెక్ట్స్. వీటిలో ది రాజా సాబ్ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న థియేటర్స్ లోకి రాబోతోంది. మిగతా మూవీస్ చిత్రీకరణలో వివిధ దశల్లో ఉన్నాయి.
 
ప్రభాస్ స్టార్ గానే కాదు వ్యక్తిగానూ అంతే గొప్పవారు. తనను ఇంత పెద్ద స్టార్ ను చేసిన అభిమానులు, ప్రేక్షకులంటే ఆయనకు ఎంతో ప్రేమ. అందుకే సొసైటీలో ఏ విపత్తు జరిగినా ప్రభాస్ ముందుగా స్పందిస్తుంటారు. మిగతా స్టార్స్ కంటే రెట్టింపు డొనేట్ చేస్తుంటారు. ఈ ఏడాది కేరళలో వనయాడ్ విలయానికి విపత్తు సాయంగా తన వంతు 2 కోట్ల రూపాయలు ఇచ్చారు ప్రభాస్, అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం 2 కోట్ల రూపాయలు విరాళం అందించారు. అజాతశత్రువు అనే పాత మాటకు డార్లింగ్ అనే కొత్త అర్థాన్నిచ్చారు ప్రభాస్. ప్రభాస్ స్టార్ డమ్, ఛరిష్మా తో పాటు ఈ మంచితనం ఆయనకు టెక్కలి నుంచి టోక్యో దాకా అభిమానులను సంపాదించి పెట్టింది. రెబెల్ ఫ్యాన్స్ అంతా ఈ రోజు ప్రభాస్ బర్త్ డేను ఘనంగా జరుపుకుంటున్నారు. మనమూ వన్ అండ్ ఓన్లీ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ కు హ్యాపీ బర్త్ డే చెప్పేద్దాం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు