నా ఫ్యాన్స్‌ను చూసి హీరో అయ్యా, మనసుకు నచ్చితే వస్తా, తగ్గేది లే : అల్లు అర్జున్

డీవీ

గురువారం, 22 ఆగస్టు 2024 (11:15 IST)
Allu Arjun
అల్లు అర్జున్‌ను ఐకాన్ స్టార్ దర్శకుడు సుకుమార్ బిరుదు ఇవ్వకుముందు ఎలా వుండేవాడో.. ఇప్పుడు ఎలా వున్నాడో అనేది ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇందుకు రాత్రి జరిగిన మారుతి నగర్‌ సుబ్రమణ్యం ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడిన మాట్లలో ఎక్కడా పశ్చాతాపడినట్లు కనిపించలేదని తెలుస్తోంది. కెరీర్ ప్రారంభంలో మామయ్యను చూసి డాన్స్ నేర్చుకున్నా. హీరోను కావాలనుకున్నా అన్న ఆయన మాటలు నేడు రివర్స్ అయ్యాయి. హీరోని చూసి అందరూ ఫ్యాన్స్ అవుతారు, నా ఫ్యాన్స్‌ను చూసి హీరో అయ్యా అంటూ మనసులోని మాట ఆవిష్కరించారు. 
 
పుష్ప సినిమా విడుదలకుముందు హైదరాబాాద్ జె.ఆర్.సి. ఫంక్షన్ హాల్లో మెగా అభిమానుల మధ్య ఫంక్షన్ చేస్తే అందరూ జై పవన్ కళ్యాన్ అంటూ నినదించారు. వారితోపాటు తనూ నినదించాడు. కానీ పుష్ప విడుదల తర్వాత సీన్ మారిందనేది అందరికీ అర్థమయిందని భావిస్తున్నారు. తాజాగా ఆయన మాట్లాడిన మాటల్లో ఎక్కడా తగ్గేదే లే అన్నట్లుగా వున్నాయి. 
 
అల్లు అర్జున్ మాట్లాడుతూ... ''నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. నేను ఎప్పుడూ అంటూ ఉంటాను... హీరోని చూసి అందరూ ఫ్యాన్స్ అవుతారు, నేను నా ఫ్యాన్స్‌ను చూసి హీరో అయ్యా. సినిమా వచ్చి మూడేళ్లు అవుతుంది. మిమ్మల్ని ఇంకోసారి ఇంత ఇబ్బంది పెట్టను. ఎక్కువ సినిమాలు చేస్తా. నాకు సుకుమార్ గారు అంటే ఎంత ఇష్టం అనేది చెబితే స్టుపిడ్ గా ఉంటుంది. ఇప్పటి వరకు చేసిన క్లైమాక్స్‌లతో పోలిస్తే మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్. ఆ పరిస్థితిలో కూడా 'వస్తున్నా తబిత గారు' అని చెప్పా. 
 
ఫ్రెండ్ అనుకో, ఇంకొకరు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకోండి... ఇష్టమైన వాళ్ళ కోసం మనం నిలబడాలి. నాకు ఇష్టమైతే వస్తా. నా మనసుకు నచ్చితే వస్తా. అది అందరికీ తెలిసిందే.
ఇక, 'పుష్ప 2' విషయానికి వస్తే... సాధరణంగా ఏదైనా సినిమా గురించి చెప్పాలంటే నాకు భయం ఉంటుంది. సినిమా ఎలా వచ్చింది? అనేది జనం చెప్పాల్సిన విషయం. అందుకు భయపడతా. కానీ, 'పుష్ప 2' సినిమా వస్తున్న విధానం అభిమానులకు నచ్చుతుంది. డిసెంబర్ 6న అసలు తగ్గేది లే. ఇది మాత్రం ఫిక్స్'' అని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు