అల్లు అర్జున్, మహేష్ బాబులతో మాస్ మహారాజా పోటీ పడుతున్నాడు. రవితేజ హీరోగా నటించిన డిస్కోరాజా సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన ఈ సినిమా బంపర్ హిట్ అయ్యింది. రిపబ్లిక్ డే రోజునే రవితేజకు పుట్టిన రోజు కావడంతో అంతా కలిసొచ్చింది.
మాస్ మహారాజా రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన సినిమా డిస్కోరాజా. భారీ అంచనాల నడుమ విడుదలైన డిస్కోరాజా మూవీలో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటించారు. జనవరి 24వ తేదీన విడుదలైన ఈ సినిమా తొలి షో తోనే మిశ్రమ స్పందన తెచ్చుకొని చెప్పుకోదగిన కలెక్షన్స్ రాబడుతోంది.
ఓ ఏరియాలో అల్లు అర్జున్, మహేష్ బాబు సినిమాలతో పోటీపడి దాదాపుగా ఆ రేంజ్ వసూళ్లు రాబట్టింది. తొలి రోజే ఈ సినిమా 3.5 కోట్ల రేంజ్ షేర్ రాబట్టినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో మంచి జోష్ కనబరుస్తున్న రవితేజ.. ఉత్తరాంధ్ర ఏరియాలో రెండో రోజు (శనివారం) కూడా కుమ్మేశాడు. 22 లక్షల షేర్ రాబట్టి మహేష్, అల్లు అర్జున్ సినిమాల సరసన నిలిచాడు.
ఇదిలా ఉంటే.. మాస్ మహారాజ రవితేజ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకి సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ప్రస్తుతం రవితేజ క్రాక్ సినిమాతో బిజీగా ఉన్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ చిత్రబృందం.. రవితేజకి బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ వీడియోని విడుదల చేశారు. ఇప్పుడీ వీడియోసోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.