కోలీవుడ్ కంటే బాలీవుడ్ చాలా బెటర్.. పాత్రలు సృష్టించడయ్యా!: నదియా

మంగళవారం, 31 మే 2016 (14:34 IST)
దక్షిణాది కంటే ఉత్తరాదిన 40 ఏళ్ల స్త్రీలకు తగిన రోల్స్ చేసేందుకు అవకాశాలు ఉంటాయని ‘ఎం.కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మీ’ చిత్రం ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఒకప్పటి హీరోయిన్ నదియా అంటున్నారు. అందమైన నదియాకు అత్తగా, అమ్మగా నటించేందుకు ఛాన్సులు వస్తున్నాయి. తమిళంలో కంటే.. తెలుగులో అవకాశాలు లభించడంతో సెకండ్ ఇన్నింగ్స్‌ను కెరీర్‌కు ఢోకాలేదు. 
 
ఈ నేపథ్యంలో అందానికి అభినయం తోడు కావడంతో వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్న నదియా కోలీవుడ్‌పై ఆరోపణలు చేస్తున్నారు. ఒకప్పుడు కోలీవుడ్‌లో సూపర్ హీరోయిన్‌గా మార్కులు కొట్టేసిన నదియా.. తనలాంటి 40 ఏళ్ల మహిళలకు కోలీవుడ్‌లో పాత్రలు తక్కువే అంటున్నారు. ఈ విషయంలో బాలీవుడ్ చాలా బెటర్ అని అంటున్నారు.  అక్కడ నటీమణుల కోసం మంచి పాత్రలు రూపొందిస్తున్నారన్నారు. అయితే ఓ తమిళ చిత్రం రీమేక్‌లో తనను నటించమని అడిగారని, కానీ ఆ చిత్రంలో పాత్ర తనకు నచ్చకపోవడంతో నిరాకరించినట్లు తెలిపారు. 
 
దక్షిణాదిలో తనకు అవకాశాలు బాగా వస్తున్నాయని, అయితే ‘ఎం.కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మీ’ చిత్రం తర్వాత తనను అందరూ అందమైన అమ్మగానే చిత్రీకరించడానికి ఆసక్తి చూపుతున్నారనే విషయాన్ని దర్శకులకు నదియా సూచించారు. అమ్మ, అత్తలే కాకుండా 40 ఏళ్ల స్త్రీల కోసం విభిన్న పాత్రలను సృష్టించాలని.. అలాంటి పాత్రలు సృష్టించేందుకు ఎన్నో విషయాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి