ఆర్థిక కష్టాలు.. తమిళ దర్శక నిర్మాత సూసైడ్

బుధవారం, 22 నవంబరు 2017 (12:30 IST)
ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న ఓ తమిళ దర్శక నిర్మాత ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక చెన్నై ఆళ్వార్ తిరునగర్‌లోని ఆయన నివాసంలోనే ఈ విషాదం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తమిళ చిత్రాల దర్శకనిర్మాత బి.అశోక్ కుమార్ పలు చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా, కొన్ని చిత్రాలను కూడా నిర్మించారు. మరికొన్ని చిత్రాలకు ఫైనాన్షియర్‌గా కూడా పని చేశారు. అయితే, గత ఏడేళ్లుగా ఆయన సినిమాలకు ఫైనాన్సియర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన చెల్లించాల్సిన డబ్బులు చెల్లించలేకపోవడంతో వారి నుంచి బెదిరింపులు ఎక్కువయ్యాయి. దీంతో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
అశోక్ కుమార్ మృతి పట్ల పలువురు తమిళ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషయంపై హీరో సిద్ధార్థ్ 'ఫైనాన్సియర్ ఒత్తిడి కారణంగా ఓ యువ కళాకారుడు మరణించటం బాధ కలిగించింది. తమిళ సినీరంగంలో ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ ప్రపంచం కేవలం పేరు, సక్సెస్‌లను మాత్రమే గుర్తిస్తుంది. మొత్తం వ్యవస్థనే మార్చాల్సిన సమయం వచ్చింది. రైతైనా, దర్శకుడైనా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితిరావటం దారుణం' అంటూ ట్వీట్ చేశాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు