శింబు, త్రిష, వడివేలుపై నిర్మాతల మండలి యాక్షన్?

సోమవారం, 20 నవంబరు 2017 (16:35 IST)
కోలీవుడ్ సినీ పరిశ్రమలో శింబు, త్రిష, వడివేలు వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. వీరిపై కఠిన చర్యలు తీసుకునేందుకు నిర్మాతల మండలి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. టాప్ కమెడియన్ వడివేలు.. అదిరింది సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇంసై అరసన్ అనే సినిమాకు సీక్వెల్‌లో నటించేందుకు వడివేలు అంగీకరించాడు. కానీ తర్వాత రోబో 2 దర్శకుడు శంకర్‌తో విబేధాలు రావడంతో సినిమా ఆగిపోయింది. దాంతో తాను కొంత మొత్తం నష్టపోయాను అని నిర్మాత శంకర్ ఫిర్యాదు చేశారు.
 
ఇదే విధంగా విక్రమ్ నటిస్తున్న సామీ2 చిత్రం నుంచి ఉన్నపళంగా హీరోయిన్ త్రిష వైదొలగడంతో తాను నష్టపోయాననని ఆ చిత్ర నిర్మాత నిర్మాతల మండలికి ప్రొడ్యూసర్ ఫిర్యాదు చేశారు. క్రియేటివ్ డిఫెరెన్స్ కారణంగా త్రిష తాను నటించనని ఆ సినిమాను నుంచి తప్పుకుంది. ఇదేవిధంగా శింబు కూడా మైఖేల్ రాయప్పన్ అనే నిర్మాత 18 కోట్లు నష్టపోవడానికి ఓ హీరో (శింబు) కారణమయ్యాడు అని నిర్మాత జ్ఞానవేల్ రాజా అన్నారు. కేవలం మొక్కుబడిగా నాలుగు గంటలు షూటింగ్‌లో ఉండి వెళ్లిపోయేవాడు. షూట్ చేసిన 30 శాతంతోనే సినిమాను రిలీజ్ చేద్దాం అని ఒత్తిడి చేశాడు.
 
విజయ్ ఆంటోని నటించిన అన్నాదురై ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఇటీవల తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా శింబు త్రిషలపై ధ్వజమెత్తాడు. త్రిష సామి-2 నుంచి తప్పుకుందని.. ఆమెను నచ్చజెప్పేందుకు ఆమె వున్న హోటల్‌లో పది గంటల పాటు వేచి చూసినా ఆమె దిగి రాలేదని.. కనీసం మాట్లాడనూ లేదన్నారు. ఇక.. ఈ ముగ్గురిపై ఫిర్యాదులు అందడంతో నిర్మాతల మండలి చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నట్టు కోలీవుడ్ వర్గాల్లో టాక్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు