ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు మహిళలకు శాశ్వత సమస్యగా మారాయన్నారు. ప్రధానంగా వినోద పరిశ్రమలో వేధింపులు మరీ ఎక్కువగా ఉన్నాయన్నారు. 'వినోద రంగం పూర్తిగా పురుషుడి ఆధిపత్యంలో కొనసాగుతోంది. ఇక్కడ వేధింపులకు ఆస్కారం ఎక్కువ. ఇక్కడి పరిస్థితులతో పోరాడడానికి మహిళలకు చాలా మనోధైర్యం కావాలి. ఇండస్ట్రీలో తమపై జరిగే వేధింపులను వెల్లడించేందుకు ఎవరూ ముందుకురావడం లేదు' అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.