మంగళవారం రాత్రి తన ప్రియుడు విక్కీ జైన్‌పై ప్రేమను తెలుపుతూ బహిరంగ లేఖ రాసింది. తన మొదటి బోయ్ ఫ్రెండ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన జూన్ 14, తర్వాత రోజు ఇలా రాయడం హాట్‌టాపిక్‌గా మారింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా వ్రాసింది: “ప్రియమైన విక్కి, పరిస్థితి కఠినంగా ఉన్నప్పుడు మీరు నా కోసం అండగా నిలిచారు. నాకు ఏదైనా సహాయం అవసరమైతే, ఎప్పుడైనా ముందుంటానని చెప్పినట్లు చేశారు. మీరు ఎల్లప్పుడూ నా గురించే ఆలోచించేవారు. అందుకే నా దృష్టిలో ప్రపంచంలోని బెస్ట్ బోయ్‌ఫ్రెండ్ మీరు. మీకు ఇలా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను అని తెలిపారు.
ఇంకా ఆమె రాస్తూ, "నాకు ఏమి అవసరమో నేను మీకు చెప్పనవసరం లేదు, నన్ను ఎప్పుడూ యువరాణిలా చూసుకున్నందుకు ఎలా కృతజ్ఞతలు తెలపాలో అర్థం కాలేదు. మీరు ఎంత బిజీగా ఉన్నా నాకోసం సమయం కేటాయించి నా కుటుంబంతో నా స్నేహితులతో చర్చించేవారు. వారికి కూడా భరోసా ఇచ్చేవారు అంటూ ధన్యవాదాలు తెలిపింది.