వరుణ్ తేజ్.చిత్రంలో వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. HER ఫైనల్ కాపీ చూసిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి ముందుకొచ్చారు. జూలై 21న సురేష్ మూవీస్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ కానుంది.
నో నాన్సెన్స్ అంటూ ఓ చమత్కారమైన నోట్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్.. సినిమా పట్ల క్యూరియాసిటీ పెంచేలా ఉంది. చిత్రంలోని ముఖ్యమైన సన్నివేశాలను కట్ చేసి ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెంచుతూ ఈ ట్రైలర్ వదిలారు. ఇందులో రుహాణి శర్మ ఎంతో గంభీరంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంది. మిగిలిన తారాగణం కూడా వారి వారి పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఇక ఈ వీడియోలోని ఆసక్తికర డైలాగ్స్ సినిమా రేంజ్ తెలిపేలా ఉన్నాయి. మొత్తంగా చూస్తే.. ఈ ట్రైలర్ సినిమా స్థాయిని పెంచుతూ ప్రేక్షకుల్లో అంచనాలు క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు.
HER ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రాజ్ కందుకూరి మాట్లాడుతూ, ఈ మధ్య వచ్చిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ అన్ని మంచి హిట్ అయ్యాయి. ఈ సినిమాలో కూడా ఒక కేసుని తీసుకొని దాన్ని చాలా బాగా సాల్వ్ చేశారు. అందులోనూ ఫిమేల్ లీడ్ తో చేయడం నాకు అది బాగా నచ్చింది. రుహాణి ఇలాంటి ఫిమేల్ లీడ్ సినిమా ఎలా చేస్తుంది అనుకున్నాను. కానీ సినిమా చూశాక తనే సినిమా అంతా మోసింది. నటులంతా బాగా యాక్ట్ చేశారు. సినిమాటోగ్రాఫర్ విష్ణు చాలా బాగా తీశాడు అన్నారు.
రుహాణి శర్మ మాట్లాడుతూ..* నాకు ఎప్పుడూ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేయాలని ఉండేది. ఈ సినిమా వచ్చి నన్ను ఆశ్చర్యపరిచింది. సినిమా నా దగ్గరికి వచ్చినప్పుడు ఫిమేల్ ఓరియెంటెడ్ నేను చేయగలనా అని ఒక డౌట్ ఉంది కానీ డైరెక్టర్ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. రిస్క్ తీసుకొని ఈ సినిమా చేశాను. డైరెక్టర్ విజన్ కి తగ్గట్టు చేశాను అని అనుకుంటున్నాను. టీం అంతా కొత్తవాళ్లు, చాలా హార్డ్ వర్క్ చేశారు సినిమా కోసం. నిర్మాతలు చాలా బాగా చూసుకున్నారు, సినిమాకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. వాళ్లకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. జులై 21 ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అందరికి నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సినిమా చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. ఇక్కడికి వచ్చి మాకు సపోర్ట్ చేసిన రాజ్ కందుకూరి గారికి, ఆన్లైన్ లో ట్రైలర్ లాంచ్ చేసిన వరుణ్ తేజ్ గారికి చాలా థ్యాంక్స్ అని తెలిపారు.
డైరెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ..* ఆన్లైన్ లో ట్రైలర్ లాంచ్ చేసిన వరుణ్ తేజ్ గారికి, ఇక్కడికి విచ్చేసిన రాజ్ కందుకూరి గారికి ధన్యవాదాలు. జనాలు థియేటర్ కి వచ్చి చూడాలంటే ఏదో ఒక కొత్త విషయం ఉండాలి. 2 గంటల లోపు ఉన్న ఈ సినిమా మొదటి సీన్ నుంచి చివరి వరకు మిమ్మల్ని అలరిస్తుంది. థియేటర్స్ కి వచ్చి సినిమా చూడండి అని తెలిపారు.