వరుణ్‌తేజ్ కెరీర్లో అత్యంత భారీ చిత్రంగా.. యూరోపియన్ దేశాలతో పాటు యు.ఎస్.ఎలోనూ షూటింగ్‌ను హ్యూజ్ బడ్జెట్‌తో ఎస్వీసీసీ పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, బాపినీడు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎంటైర్ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్ట్ 25న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను గ్రాండ్ లెవల్లో విడుదల చేస్తున్నారు.
గాంఢీవధారి అర్జున షూటింగ్ పూర్తయిన విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో వరుణ్ తేజ్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. చేతిలో గన్ పట్టుకుని నిలుచుని ఉన్నారు. వరుణ్‌తేజ్ ఈ చిత్రంలో సెక్యూరిటీ ఆఫీసర్‌గా కనిపిస్తారు. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి ప్రజలను అతను ఎలా కాపాడాడు, అతని స్ట్రాటజీస్ ఏంటి? అనేది తెలుసుకోవాలంటే ఆగస్ట్ 25 వరకు ఆగాల్సిందేనంటున్నారు మేకర్స్. ఈ చిత్రానికి మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ సినిమాటోగ్రఫీ, అవినాష్ కొల్ల ఆర్ట్ వర్క్ అందిస్తున్నారు