ఓవైపు హీరోలు పాత్రలు పోషిస్తూనే మరోవైపు అందివచ్చిన విలన్ పాత్రల్లో నటిస్తున్న నటుడు ఆది పినిశెట్టి. 'సరైనోడు', 'నిన్ను కోరి' వంటి చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ అప్‌కమింగ్ చిత్రంలో ఓ కీల్ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో తన పాత్రని దర్శకుడు త్రివిక్రమ్ తీర్చిదిద్దిన తీరు గురించి ఆది గొప్పగా చెప్పుకొచ్చాడు కూడా. అంతేకాకుండా పవన్ కల్యాణ్‌తో కలిసి నటిస్తున్న విశేషాలని సైతం వివరించాడు. ఇక హీరో రాంచరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న "రంగస్థలం"లోనూ కీలక పాత్ర చేస్తున్నాడు.
ఇలా, ఒకవైపు హీరోగా చేస్తూనే, మరోవైపు సపోర్టింగ్ రోల్స్‌లో అలరిస్తున్న ఆది పినిశెట్టి త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ప్రస్తుతం తన ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని, వీలైనంత త్వరలో శుభవార్త చెపుతానని చెపుతున్నాడు హీరో కమ్ విలన్. ఏది ఏమైనా, ఆది పినిశెట్టికి అడ్వాన్స్ శుభాకాంక్షలు చెపుదాం.