హీరో కార్తి సర్దార్ సినిమాకు సీక్వెల్ గా ప్రస్తుతం సర్దార్ 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్ 2కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో మాళవిక మోహన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ ఫిమేల్ లీడ్స్ గా నటిస్తుండగా ఎస్ జె సూర్య ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు.