ఎస్.ఆర్. కళామండపంతో గుర్తింపు పొందిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత కొన్ని ఫెయిల్యూర్ చవిచూసి పట్టువదలని విక్రమార్కుడిగా క చిత్రంతో హిట్ సంపాదించాడు. ఆ సినిమా విడుదలకుముందే చిత్ర నిర్మాత చింత గోపాలకృష్ణ రెడ్డి తదుపరి చిత్రాన్ని కూడా కిరణ్ తో తెరకెక్కిస్తానని ప్రకటించాడు. ఆ సినిమాకు సుజీత్, సందీప్ దర్శకత్వం వహించారు. వారు కూడా కిరణ్ తో మరో సినిమాను చేయాలనుందని వెల్లడించారు. కానీ ఈసారి సరికొత్త టీమ్ తో కిరన్ అబ్బవరం రాబోతున్నాడని తెలుస్తోంది.