సముద్ర తీరాన నిఖిల్ ఫ్యామిలీ.. కుమారుడి సముద్రపు తొలి స్పర్శ (video)

సెల్వి

బుధవారం, 4 డిశెంబరు 2024 (16:29 IST)
Nikhil
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తన కుటుంబంతో కలిసి సముద్ర తీరాన హాయిగా గడిపారు. వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న ఆయనకు కాస్త సమయం దొరకడంతో కొడుక్కి సముద్ర అనుభూతిని అందించేందుకు పేరుపాలెం బీచ్‌‌‌కు వెళ్లారు. భార్య పల్లవి వర్మ, కొడుకుతో బీచ్‌లో ఆడుకున్న వీడియోను ఆయన షేర్ చేశారు. 
 
'ధీర సముద్రపు తొలి స్పర్శ' అని ఆయన రాసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. హ్యాపీడేస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ ఆ తర్వాత అష్టాచమ్మా, కార్తీకేయ, స్వామిరారా సినిమాలతో హిట్స్ అందుకున్నాడు. 
 
కార్తీకేయ 2తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ప్రస్తుతం మరో పాన్ ఇండియా మూవీ స్వయంభూ షూటింగ్‌లో బిజీగా వున్నారు. ఈ చిత్రంలో హీరో నిఖిల్ ఓ వారియర్ పాత్రలో కనిపించబోతున్నారు. 

బీచ్‌లో కొడుకుతో నిఖిల్ సందడి

యంగ్ హీరో నిఖిల్ తన కుటుంబంతో కలిసి
సందడిగా గడిపారు. వరుస సినిమాలతో బిజీగా
ఉంటున్న ఆయనకు కాస్త సమయం దొరకడంతో కొడుక్కి సముద్ర అనుభూతిని అందించేందుకు పేరుపాలెం బీచ్‌‌‌కు వెళ్లారు. భార్య పల్లవి వర్మ, కొడుకుతో బీచ్‌లో ఆడుకున్న వీడియోను ఆయన షేర్ చేశారు.… pic.twitter.com/qu66JSAwPw

— ChotaNews (@ChotaNewsTelugu) December 4, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు