తన కుటుంబానికి అత్యంత సన్నిహితురాలైన పవిత్ర అనే అమ్మాయి మెడలో ఆయన మూడుముళ్లు వేయనున్నారు. ఇరు కుటుంబపెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుంది. ఈ మేరకు సుమంత్-పవిత్రలకు సంబంధించిన ఓ పెళ్లిపత్రిక నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.
ప్రేమకథతో వెండితెరకు పరిచయమైన సుమంత్ .. స్నేహమంటే ఇదేరా, సత్యం, గోదావరి, గోల్కోండ హైస్కూల్ చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే వరుస పరాజయాల అనంతరం మళ్లీరావా సినిమాతో సుమంత్ పాజిటివ్ టాక్ అందుకున్నారు.
ఇటీవల ఆయన కథానాయకుడిగా నటించిన కపటధారి మిశ్రమ స్పందనలు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా అనగనగా ఒక రౌడీలో నటిస్తున్నారు. నిజానికి తన తొలి వివాహమైన తర్వాత ఆయన మరో పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తూ వచ్చారు. కానీ, ఇపుడు రెండో పెళ్లికి సమ్మతించడంతో అక్కినేని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.