టిఆర్పి రేటింగ్ తో చరిత్ర సృష్టించిన సరైనోడు, ఏబిసిడి హిందీ డబ్బింగ్

శనివారం, 20 మార్చి 2021 (13:34 IST)
ABCD, Sarinodu
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు తెలుగుతో పాటు హిందీలో కూడా బ్రహ్మాండమైన ఇమేజ్ వుంది. ఆయన డబ్బింగ్ సినిమాలకు అక్కడ అద్భుతమైన వ్యూవర్ షిప్ వస్తుంది. ఇప్పుడు కూడా మరోసారి ఇదే జరిగింది. అల్లు అర్జున్ నటించిన సరైనోడు, అల్లు శిరీష్ నటించిన ఏబిసిడి (అమెరికన్ బార్న్ కన్ఫ్యూషన్ దేశీ) గత వారం అత్యధిక టిఆర్పి సాధించిన హిందీ డబ్బింగ్ సినిమాలుగా చరిత్ర సృష్టించాయి. బార్క్ రేటింగ్స్ ఆధారంగా హిందీ ప్రేక్షకులు సరైనోడు, ఏబిసిడి సినిమాలపై ఎక్కువ మక్కువ చూపించారని రేటింగ్స్ నిరూపిస్తున్నాయి.
సరైనోడు, ఏబిసిడి సినిమాలకు 4863,4016 యావరేజ్ మినిట్ ఆడియన్స్ (AMA) వచ్చింది. బాహుబలి ది కంక్లూజన్ కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. అదే వారం బాహుబలి కూడా టీవీలో ప్రసారమైంది. దీనికి 3609 యావరేజ్ మినిట్ ఆడియన్స్ నమోదయింది.
 
తమ సినిమాపై హిందీ ఆడియన్స్ చూపించిన ప్రేమపై అల్లు శిరీష్ స్పందించారు. తన సినిమాకు నిజంగా ఇంత అద్భుతమైన రేటింగ్స్ వస్తాయని అనుకోలేదని.. హిందీ ప్రేక్షకులు తనపై చూపించిన ప్రేమ మాటల్లో చెప్పలేను అంటున్నారు. సినిమాలో వినోదం కారణంగా వాళ్ళు అంత బాగా కనెక్ట్ అయ్యారు అని చెప్పుకొచ్చారు శిరీష్. ఒక నటుడిగా వాళ్లను అలరించడానికి తన వంతు ప్రయత్నం చేస్తాను అంటున్నారు శిరీష్.
ఏబిసిడి హిందీ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న గోల్డ్ మైన్స్ టెలీ ఫిలిమ్స్ చెప్పిన దాని ప్రకారం.. ఈ సినిమాలోని అద్భుతమైన వినోదం కారణంగా హిందీ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ABCD పూర్తిగా ఫన్ ఫిలిం. అల్లు శిరీష్ తన స్క్రీన్ ప్రెజెన్స్, నటనతో ఆకట్టుకున్నాడు అని తెలిపారు.
బాక్సాఫీస్ దగ్గర అల్లు బ్రదర్స్ సినిమాలు రికార్డులు సృష్టిస్తున్నాయి. అలాగే యూట్యూబ్ లో కూడా వాళ్లకు మంచి వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు ఇదే జోరు టెలివిజన్ లో కూడా చూపిస్తున్నారు అల్లు సోదరులు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు