హీరోయిన్‌తో వ్యభిచారం.. రూ.లక్షతో ఒప్పందం...

ఆదివారం, 8 జులై 2018 (15:59 IST)
హైదరాబాద్‌లోని ఓ నక్షత్ర హోటల్‌లో వ్యభిచారం చేస్తూ ఓ హీరోయిన్ పట్టుబడింది. ఈమె పేరు దీక్షా కుష్వా. భోజ్‌పురి నటి. ఈమెతో పాటు.. విటుడుగా ఉన్న ఢిల్లీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగి, ఈ వ్యభిచార దందా నిర్వాహకుడు జనార్ధన్ రావులను పోలీసులు అరెస్టు చేశారు.
 
అయితే, పోలీసుల విచారణలో జనార్ధన్ రావు అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వారం రోజుల పాటు హోటల్ గదిలో ఉండి వ్యభిచారం చేసేందుకు లక్ష రూపాయలు ఇచ్చే ఒప్పందంపై ముంబై నుంచి దీక్షా కుష్వాను హైదరాబాద్‌కు తీసుకు వచ్చినట్టు చెప్పాడు. గతంలో తాను పలువురు హీరోయిన్లను హైదరాబాద్‌కు తీసుకొచ్చి వ్యభిచారం చేయినట్టు చెప్పారు. ఇపుడు ఆ హీరోయిన్ల పేర్లను తెలుసుకునేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
కాగా, తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన జనార్ధన్ రావు.. చానాళ్ల క్రితమే హైదరాబాద్‌కు వచ్చి పద్మారావు నగర్‌లో నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా వ్యభిచార దందా నిర్వహిస్తున్నాడు. గతంలో బంజారాహిల్స్, పంజాగుట్ట పోలీసులకు పట్టుబడ్డాడు కూడా. ఇతని కదలికలపై పోలీసులు నిఘా ఉంచగా, దీక్షా కుష్వాను హైదరాబాద్‌కు రప్పించి వ్యభిచారం చేయిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు