హాలీవుడ్ ఆన్ లైన్ పోర్టల్ ''స్క్రీన్‌రాంట్'' సర్వేలో బాహుబలికి 12వ స్థానం

సోమవారం, 12 సెప్టెంబరు 2016 (11:53 IST)
టాలీవుడ్ వైపు ప్రపంచాన్ని తిరిగి చూసేలా చేసిన జక్కన్న బాహుబలి సినిమా విడుదలై ఏడాదిన్నర కావొస్తున్నా.. రికార్డుల పంట పండిస్తోంది. తాజాగా హాలీవుడ్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌ ''స్క్రీన్‌రాంట్‌" నిర్వహించిన సర్వేలో బాహుబలికి 12వ స్థానం లభించింది.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1500 సినిమాలను పరిశీలించి జాబితాను తయారుచేయగా, ఓ తెలుగు చిత్రం 12వ స్థానం లభించడం చాలా గొప్ప విషయం.
 
ఇక బాహుబలితోపాటు థాయ్‌లాండ్‌కు చెందిన "ఆంగ్‌ బ్యాక్‌'', బ్రెజిలియన్‌ మూవీ "ది సిటీ ఆఫ్‌ గాడ్" , ఫ్రెంచ్‌ సినిమాలు "అమేలీ",అఖిరా కురోసవా జపనీస్‌ క్లాసిక్‌ "రాన్‌'' చిత్రాలు కూడా స్థానం దక్కించుకున్నాయి. ఇకపోతే.. బాహుబలి 2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే క్లైమాక్స్ షూట్ పూర్తి చేసిన రాజమౌళి.. ప్రస్తుతం పాటల చిత్రీకరణలో ఉన్నాడు. 2017లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

వెబ్దునియా పై చదవండి