ఫ్రేమ్స్ ఓటీటీలో వ‌స్తోన్న హోలీ వుండ్‌

మంగళవారం, 9 ఆగస్టు 2022 (16:13 IST)
Holly Wound
స‌హ‌స్ర సినిమాస్ ప్రై. లి స‌మ‌ర్ప‌ణ‌లో జాన‌కి సుంద‌ర్‌, అమృతా వినోద్‌, సాబు ప్రౌదిక్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో    సందీప్ ఆర్ మ‌ల‌యాళంలో నిర్మించిన చిత్రం `హోలీవుండ్‌`. అశోక్ ఆరాన్ ద‌ర్శ‌కుడు.  లెస్బియ‌న్ నేప‌థ్యంలో రూపొందిన  ఈ  సైలెన్స్ సినిమా  ఎన్నో కాంట్ర‌వ‌ర్సీల మ‌ధ్య ఈ నెల 12న ఎస్ ఎస్ ఫ్రేమ్స్ ఓటీటీ ద్వారా గ్రాండ్ గా రిలీజ‌వుతోంది.
 
ఈ సంద‌ర్భంగా  నిర్మాత సందీప్ ఆర్ మాట్లాడుతూ...``చిన్న‌ప్ప‌టి నుంచి క‌లిసి పెరిగిన ఇద్ద‌రు అమ్మాయిలు.. కొంత కాలంగా క‌లిసి ఉండ‌టంతో వారిద్ద‌రి మ‌ధ్య సెక్స్ ఫీలింగ్స్ క‌లుగుతాయి. సృష్టికి విరుద్దంగా వారు లైంగిక సంతృప్తి చెందుతుంటారు. ఈ నేప‌థ్యంలో ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి అన్న‌ది సినిమా.  డీప్ ప్రేమ‌లో ఉన్న ఇద్ద‌రు ఆడ‌వాళ్లు, ఇద్ద‌రు మ‌గ‌వాళ్లు శృంగారంలో పాల్గొన‌డం త‌ప్పు కాదు అనే అంశాన్ని మా సినిమాలో చూపిస్తున్నాం. మా సినిమా ఎన్నో వివాదాల్లో చిక్కుకొని ..వాట‌న్నింటినీ దాటుకొని ఈ నెల 12న ఎస్ ఎస్ ఫ్రేమ్స్ ఓటీటీ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. మాట‌లు లేని ఈ సైలెన్స్  లెస్బియ‌న్ సినిమా  మీ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంద‌ని న‌మ్ముతున్నాం`` అన్నారు.
ఈ చిత్రానికి  డీఓపిః ఉన్ని మాధ‌వూర్‌; సంగీతంః రోన్ రాఫిల్ ;  స్క్రీన్ ప్లేః పాల్ విక్‌లిఫ్‌; ఎడిటింగ్ః విపిన్ మానూర్; ద‌ర్శ‌కుడుః అశోక్ ఆరాన్‌,  నిర్మాతః సందీప్ ఆర్‌.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు