చిరంజీవిపై తేనెటీగల దాడి... కాపాడిన రక్షణ సిబ్బంది

ఆదివారం, 31 మే 2020 (14:07 IST)
మెగాస్టార్ చిరంజీవి ఆదివారం తేనెటీగల దాడి నుంచి తప్పించుకున్నారు. ఆయనపైనా, ఆయన కుటుంబ సభ్యులపై తేనెటీగలు దాడి చేశాయి. వీటి నుంచి ఆయన సహయ సిబ్బంది రక్షించారు. అసలు చిరంజీవిపై తేనెటీగలు ఎందుకు దాడిచేయాన్నదే కదా మీ  సందేహం. ఇవిగో వివరాలు..
 
మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన తాతయ్య, దోమకొండ సంస్థాన వారసుడు, తిరుమల తిరుపతి దేవస్థానం తొలి ఈవో కామినేని ఉమాపతిరావు (రిటైర్టు ఐఏఎస్ అధికారి) బుధవారం మృతిచెందారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం ఉదయం నిర్వహించారు. గడికోట లక్ష్మీబాగ్‌లో ఇవి జరిగాయి. 
 
ఈ కార్యక్రమం కోసం చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన ఇతర బంధువులు హాజరయ్యారు. గడికోట నివాసం నుంచి ఉమాపతిరావు భౌతికకాయాన్ని వెలుపలికి తీసుకువస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. దాంతో అందరూ చెల్లాచెదురయ్యారు. 
 
అయితే, భద్రతా సిబ్బంది అప్రమత్తమై చిరంజీవి, రామ్ చరణ్‌లను ఇంట్లోకి తీసుకెళ్లడంతో ప్రమాదం తప్పింది. కాసేపటికి తేనెటీగలు శాంతించడంతో అంత్యక్రియలు యథావిధిగా పూర్తి చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు