బాలీవుడ్ హీరో పెద్ద మనసు : సినీ, టీవీ కార్మికులకు హృతిక్ రోషన్

శుక్రవారం, 4 జూన్ 2021 (08:48 IST)
దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తుంది. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. దీంతో సినిమా షూటింగులన్నీ బంద్ అయ్యాయి. ఫలితంగా సినీ కార్మికులు పూటగడవక చాలా ఇబ్బందులు పడుతున్నారు. 
 
ఈ ప‌రిస్థితి తెలుసుకున్న ప్ర‌ముఖులు వారికి అండగా నిలుస్తూ నిత్యావ‌స‌ర స‌రుకులు అందిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న సినీ టీవీ కార్మికులను ఆదుకునేందుకు ముందుకు వ‌చ్చారు.
 
సినీ, టీవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌కు రూ.20 లక్షల ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర వస్తువుల కిట్లు అందించారు. ఈ విషయాన్ని సంస్థ ప్రధాన కార్యదర్శి అమిత్‌ బెహల్‌ తెలిపారు. 
 
ఈ మొత్తాన్ని 5 వేల మంది స‌భ్యుల‌కు వ్యాక్సిన్‌తో పాటు నిత్యావ‌స‌రాల కోసం ఉప‌యోగిస్తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. గ‌త ఏడాది క‌రోనా స‌మ‌యంలోను 25 ల‌క్ష‌ల రూపాయ‌ల సాయం చేశారు. మ‌రో బాలీవుడ్ న‌టుడు విక్కీ కౌశ‌ల్ రెండున్న‌ర ల‌క్షల రూపాయ‌లు విరాళంగా అందించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు