రంభ సోదరుడు శ్రీనివాసరావుకు 1999లో పల్లవితో వివాహం కాగా, తనను భర్త, అత్తమామలు, ఆడపడుచు రంభ వేధించారని 2014 జూలైలో పల్లవి మూడో చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశాలతో వీరు ముగ్గురిపై ఐపీసీ 498 (ఏ) కింద కేసు నమోదైంది.
అప్పటి నుంచి రంభకు ఎప్పుడు సమన్లు ఇవ్వాలని చూసినా, ఆమె అమెరికాలో ఉంటుండటంతో వీలు కాలేదు. ఇటీవల ఓ టీవీ చానల్ రియాల్టీ షో కోసం ఆమె హైదరాబాద్ వచ్చిందని తెలుసుకున్న పోలీసులు, పద్మాలయా స్టూడియోలో షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి బుధవారం రాత్రి 8 గంటల సమయంలో వచ్చి సమన్లు అందించారు. వెంటనే న్యాయస్థానానికి రావాలని ఆదేశించారు.