బాలయ్యా నేను రెడీ... మరి మీరు: మెగాస్టార్ చిరంజీవి ఛాలెంజ్ (video)

ఐవీఆర్

బుధవారం, 30 అక్టోబరు 2024 (11:24 IST)
యువరత్న నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానంపై ప్రత్యేక ఈవెంట్ హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ బాలయ్య ఇదే ఎనర్జీతో ఇంకా ఎన్నో చిత్రాలు చేయాలని ఆకాంక్షించారు.
 
మా ఇద్దరి కాంబినేషన్లో సినిమా కావాలని చాలామంది కోరుతుంటారు. ఇంద్రసేనా రెడ్డి వర్సెస్ సమర సింహారెడ్డి స్టామినా వున్న కథతో ఎవరైనా దర్శకులు మా ముందుకు కథతో వస్తే నేను రెడీ. మరి బాలయ్య మీరు రెడీయేనా అన్నారు. వెంటనే బాలయ్య కూడా నేను రెడీ అనేశారు. వెంటనే మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ... దర్శకులకు ఇదే ఛాలెంజ్. అంత శక్తివంతమైన కథతో వస్తే నటించేందుకు మేమిద్దరం సిద్ధం అని అన్నారు మెగాస్టార్.

దర్శకుడు మంచి కధతో వస్తే సమరసింహ ఇంద్రసేన కలసి నటించటానికి సిద్దం ఇది మేమిద్దరం దర్శకులకు విసురుతున్న ఛాలెంజ్ pic.twitter.com/JPE79McS4M

— మన ప్రకాశం (@mana_Prakasam) October 29, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు