భారతీయ చలన చిత్ర చరిత్రలో ఎవరినైనా ధిక్కరించి మాట్లాడగల బోల్డ్ అండ్ బ్యూటిపుల్ హీరోయిన్ ఎవరంటే కంగనా రనౌత్ పేరునే చెప్పాలి. హృతిక్ రోషన్ వ్యవహారాన్ని నలుగురిలో కడిగి పారేసినా, బాలీవుడ్ హేమాహేమీలను కత్తుల్లాంటి మాటలతో భయపెట్టినా ఆమెకే చెల్లుతుందని చెప్పాలి. హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన మొదట్లో తన విషయంలో అతిగా, అసభ్యంగా వ్యవహరించిన, వాడుకోవాలిని చూసిన ఏ ఒక్కరిని ఆమె తదుపరి దశలో వదిలిపెట్టలేదు. ఇప్పుడామె దృష్టి శ్రీదేవిపై పడింది. చెడ్డగా కాదు. మంచిగానే ఆమె తర్వాత నేనే అని ఆత్మవిశ్వాసం ప్రదర్శించుకుంది.
బాలీవుడ్‌లో మోస్ట్ సీనియర్ నటి శ్రీదేవితో పోల్చుకోవడం ద్వారా కంగనా ఒక విధంగా సంచలనమే సృష్టించింది. లాలిత్యంలో, సాఫ్ట్ యాక్టింగ్ స్కిల్స్ ప్రదర్శించడంలో శ్రీదేవితో పోటీపడేవారు బాలీవుడ్‌లోనే కాదు భారతీయ చిత్రపరిశ్రమలోనే ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. కాని ఒక్క విషయంలో మాత్రం శ్రీదేవి తర్వాతి స్థానం తనదే అని కంగనా బోల్ట్ స్టేట్మెంట్ ఇచ్చేసింది.