ది 100 సినిమాకు ముందు సుకుమార్ కథలు అడిగా : ఆర్కే సాగర్

దేవీ

శనివారం, 12 జులై 2025 (17:09 IST)
RK Sagar, Siva, Misha narang
హీరో ఆర్కే సాగర్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్  'ది 100'. ఈ హై-ఆక్టేన్ క్రైమ్ థ్రిల్లర్‌ను రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. కెఆర్ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రమేష్ కరుటూరి, వెంకి పుషడపు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం జూలై 11న థియేటర్స్ లో విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని, ఘన విజయం సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. 
 
ఈ సందర్భంగా తమ ఆనందాన్ని పంచుకుంటూ సాగర్ మాట్లాడారు. టీవీ సీరియల్స్ లో పోలీస్ గా ఫిట్ అనేవారు. అలాంటి కథ కోసం ఓసారి సుకుమార్ గారి దగ్గరకు వెళ్ళి మంచి కథ వుంటే చూడండి. మీ అసిస్టెంట్లు దగ్గర కథలు ఏమైనా వున్నాయా? అని అడిగా. అసలు నీ దగ్గర ఎటువంటి కథ వుంది అని అడిగారు. నేను ది 100 కథ చెప్పాను. అసలు కథంటే ఇదే గదా. ప్రొసీడ్ అన్నారు. ఆయన ఇచ్చిన స్పూర్తితో నేను ఫస్ట్ స్టెప్ వేశా. సక్సెస్ పొందాను. ఆయన విదేశాల్లో వున్నారు. ఇండియా రాగానే సుకుమార్ గారికి సినిమా చూపిస్తాను అని చెప్పారు.  
 
రాజా రవీంద్ర మాట్లాడుతూ... అందరికి నమస్కారం. ఒక పోలీసుగా ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ విక్రమ్ ఐపీఎస్ లాగా ఉండాలని అనిపించింది. 100 నాట్ నెంబర్ ఒక వెపన్. సినిమా అందరికీ కనెక్ట్ అయింది. ఇంత మంచి సినిమాని అందించిన ఆర్కే నాయుడు గారికి వారి టీమ్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్'అన్నారు.  
 
మిషా నారంగ్ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. మా సినిమా గురించి అందరూ చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. ఆడియన్స్ ఈ సినిమా మీద చూపిస్తున్న ప్రేమకి ఆనందంగా ఉంది. ఇలాంటి మంచి క్యారెక్టర్ ని ప్లే చేసిన అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా చూడండి మీ అందరికీ నచ్చుతుంది'అన్నారు.  
 
డైరెక్టర్ శశిధర్ మాట్లాడుతూ, స్క్రీన్ ప్లే చాలా బాగుందని టాక్ వచ్చింది. ఇండస్ట్రీ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు స్క్రీన్ ప్లే లో గురువు క్రిష్ణవంశీ. ఆయన సినిమాల నుంచి నేర్చుకున్నా. అలాగే మా ఫ్యామిలీలో చాలామంది పోలీసు అధికారులున్నారు. వారినుంచి  నేరం చేసినవారు ఎలా బిహేవ్ చేస్తారు. వారు ఎలా మాట్లాడతారు. వారికి తగినట్లుగా అధికారులు ఎలా రియాక్ట్ అవుతారనేది బాగా తెలుసుకుని సినిమా చేశా. ఆ పాత్ర ఆర్.కె. సాగర్ చేశాడు. మౌత్ టాక్ తో మంచి సినిమాగా పేరు పొందింది. ఈ సినిమాకు కథ దొరికితే సీక్వెల్ గా చేయాలనే ఆలోచిస్తున్నాం అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు