Krishna Manineni donates Rs 2 lakh to Sravanthi
జెట్టి సినిమా హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో వారు స్థాపించిన సేవా సంస్థ 100Dreams Foundation ద్వారా, సినీ నటుడు ఫిష్ వెంకట్ వైద్య అవసరాల కోసం వారి కూతురు స్రవంతి కి PRK హాస్పిటల్స్ లొ రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. చిత్రపరిశ్రమలో తనదైన హాస్యంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఫిష్ వెంకట్ గారు అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆయన వైద్య ఖర్చులకు మద్దతుగా ఈ ఆర్థిక సహాయం అందించడం హీరో కృష్ణ గారి యొక్క మానవతా విలువలను ప్రతిబింబిస్తోంది.