ఇందులో హీరో ప్రభాస్ మాట్లాడుతూ, "శ్రీరాముడి ఆశీస్సులు తీసుకునేందుకు ఇక్కడికి వచ్చాం. రాముడి పాత్రలో నటించేందుకు మొదట ఎంతో భయపడ్డా. ప్రాజెక్ట్ ఓకే అనుకున్నాక మూడు రోజుల తర్వాత ఓం రౌత్‌కు ఫోన్ చేసి.. ప్రేక్షకులకు చేరువయ్యేలా ఈ పాత్రలో ఎలా ఒదిగిపోవాలనే విషయంపై చర్చించాను.
ప్రేమ, భక్తి, భయంతో దీన్ని తెరకెక్కించాం. అంకితభావం, క్రమశిక్షణ, విశ్వాసంతో ఉండటం.. ఈ మూడు విషయాలను శ్రీరాముడి నుంచి మనం నేర్చుకోవచ్చు. శతాబ్దాలుగా మనం ఈ లక్షణాలను అనుసరించాలని చూస్తున్నాం కానీ మన వల్ల కావడం లేదు. అందుకే మనం సామాన్య మనుషులమయ్యాం. శ్రీరాముడు దేవుడు అయ్యాడు. ఆ శ్రీరాముడి కృప మాపై ఉంటుందని విశ్వసిస్తున్నా" అని ప్రభాస్ చెప్పుకొచ్చారు.