ఇంటర్నేషనల్ స్టార్ ప్రభాస్ - కృతి సనన్ జంటగా నటించిన చిత్రం "ఆదిపురుష్". ఓం రౌత్ దర్శకత్వం. 'రామాయణం' ఇతివృత్తంగా రూపొందిన ఈ సినిమా టీజర్‌ను అయోధ్య వేదికగా ఆదివారం సాయంత్రం మేకర్స్ విడుదల చేశారు. "భూమి కుంగినా, నింగి చీలినా.. న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం" అంటూ ప్రభాస్ గంభీరంగా పలికిన డైలాగ్‌తో టీజర్ ఆరంభమవుతుంది.
ప్రభాస్ అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'ఆదిపురుష్'. 'సాహో', 'రాధేశ్యామ్' వంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల తర్వాత ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
కృతి సనన్ సీతగా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రను పోషిస్తున్నారు. టీ సిరీస్, రెట్రోఫైల్స్ పతాకాలపై భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ నుంచి వంశీ, ప్రమోద్ నిర్మాణంలో భాగమవుతున్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనవరి 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు.