మూడేళ్ల కష్టం. సినిమా అప్పుడే అయిపోయిందా? అనే ఫీలింగ్ కలిగింది. పడ్డ కష్టమంతా నాకు కనపడలేదు. నిజంగా గొప్ప స్క్రిప్ట్‌ను నా చేతిలో పెట్టినప్పుడు .. చిరంజీవి గారికి చెప్పి ఓకే అనుకున్న తర్వాత స్క్రిప్ట్ చేతిలో పెట్టుకుని నేను నిద్రలేని రాత్రులు ఎన్నింటినో గడిపాను అని సైరా డైరెక్టర్ సురేందర్ రెడ్డి చెప్పారు. సైరా సక్సస్ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.... ఇన్ని వందల కోట్లు పెట్టి ఇంత పెద్ద సినిమా తీస్తున్నాం. ఇలాటి హిస్టారికల్ మూవీస్ ఎన్ని ఆడాయి.. కొన్నే ఉన్నాయనే భయం ఉండేది.
మెగాస్టార్ లాంటి హీరోనిచ్చారు. ఈ స్క్రిప్ట్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ లేదు. చిరంజీవి గారిని పెట్టుకుని పాట లేదు. చిరంజీవి గారిని కథలో చంపేస్తున్నాం… మరి సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఎలా అవుతుంది? అని భయపడ్డాను. నిద్రలేని రాత్రులు గడిపాను. అందులో నాకు కనపడింది ఒకటే దేశభక్తి. దాన్నే నమ్మాను. చిరంజీవి గారు కూడా అదే నమ్మి నన్ను భుజం తట్టి ముందుకెళ్లమన్నారు. ఆ బాటలో వెళ్లిపోయాను.
నాతో పాటు మూడేళ్లు చాలా కష్టపడ్డారు. రాజీవన్ నా విజన్‌ను ఆవిష్కరిస్తే, రత్నవేలు గారు నా కలను అలాగే తెర పైకి తీసుకొచ్చారు. అలాగే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ.. ఎంతో కష్టపడ్డారు. అందరూ రక్తం ధారపోసి పనిచేశారు. అందరికీ కృతజ్ఞతలు.
తన నాన్నగారి కోసం ఓ గొప్ప సినిమా తీయాలనేది రామ్‌చరణ్‌గారి కల. అలాగే చిరంజీవి గారి డ్రీమ్‌ను కూడా ఆయన తీర్చేశారు. చిరంజీవి గారి డ్రీమ్‌ను తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఆ డ్రీమ్‌ను నేను పూర్తి చేశానని గర్వంగా చెప్పుకుంటున్నాను. చాలా గర్వంగా ఉంది. చిరంజీవి గారికి, చరణ్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. 500 కుటుంబాలు ఈ సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డాయి. కాబట్టి ఈ సినిమాను థియేటర్‌లోనే చూడండి. పైరసీని ఎంకరేజ్ చేయకండి అన్నారు.