సరయు అంటే యూ ట్యూబ్ చూసేవాళ్లకు తెలియకుండా వుండదు. ఆమె తన ఛానల్లో చేసే రచ్చ అంతాఇంతా కాదు. పచ్చి బూతులతో రెచ్చిపోతుంది. ఎదుటివాళ్ల కామెంట్లను అస్సలు పట్టించుకోదు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడేస్తుంది. ఆ మాటలే ఆమెను యూ ట్యూబ్ స్టార్ ను చేసాయి. ఆ కారణంగా ఏకంగా బిగ్ బాస్ సీజన్ 5లోనూ అవకాశం వచ్చింది. కానీ మాటలకు హద్దూపొద్దూ లేకపోవడంతో మొదటివారంలోనే బయటకు వచ్చేసింది.
తను ఓ వ్యక్తితో ఏడేళ్లపాటు రిలేషన్ షిప్ కలిగి వున్నట్లు చెప్పింది. అతడితో అలా వున్నట్లు ఆవైపు ఈవైపు పెద్దలకు తెలుసుననీ, అతడికి తనను తాను పూర్తిగా సమర్పించుకున్నట్లు తెలిపింది. తను ఇప్పుడు వర్జన్‌ను కూడా కాదని కుండబద్ధలు కొట్టింది.
ఐతే అతడిని పెళ్లాడేందుకు సిద్ధమై పెళ్లి దగ్గరకు వచ్చేసరికి కట్నం దగ్గర అతడి పేరెంట్స్ గొడవపెట్టుకున్నారనీ, మొదట 25 లక్షలతో మొదలై సగం ఆస్తి వరకూ కావాలని డిమాండ్ చేసారని వెల్లడించింది. తనకు చిర్రెత్తికొచ్చి అతడితో పెళ్లి క్యాన్సిల్ చేసేసానంటూ వెల్లడించింది. తనకు తగినవాడివి నీవు కాదని అతడి ముఖం మీదే చెప్పేసి వచ్చేసినట్లు చెప్పింది సరయు.