ప్రస్తుతం మన తెలుగు సినిమా ఖ్యాతి, తెలుగు హీరోల స్థాయి ప్రపంచ దేశాలకు విస్తరించిన సంగతి తెలిసిందే. ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన దేవర సినిమాను జపాన్‌లో భారీ ఎత్తున ప్రమోట్ చేశారు. ఆర్ఆర్ఆర్ తరువాత అక్కడ మ్యాన్ ఆఫ్ మాసెస్‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. అందుకే అక్కడి అభిమానుల్ని అలరించేందుకు దేవరను జపాన్‌లో రిలీజ్ చేశారు. ఈ క్రమంలో అక్కడి మీడియా, అభిమానులతో ఎన్టీఆర్ ముచ్చటించారు.