Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

దేవీ

బుధవారం, 26 మార్చి 2025 (10:05 IST)
Lakshmi Pranati, NTR
ఎన్టీఆర్ హీరోగా జాన్వీకపూర్ నాయికగా  దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో నటించిన సినిమా దేవర. తెలుగులో మంచి హిట్ సొంతం చేసుకుంది. దానికి సీక్వెల్ ఇంకా చేయాల్సివుంది. కాగా, ఈ మార్చిలో ఈ సినిమాను జపాన్ బాషలో విడుదల చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన జపాన్ పర్యటనలో ఎన్.టి.ఆర్. దంపతులు వున్నారు. అక్కడ జపాన్ మీడియాలో ఇంట్రాక్ట్ అయిన ఫొటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
 
Lakshmi Pranati, NTR
అలాంటి ఫొటోలు నేడు ఎన్.టి.ఆర్. తన ఇన్స్ట్రాగ్రామ్ లో పోస్ట్  చేశాడు. తన భార్య లక్ష్మీ ప్రణతి తో కలిసి పబ్ లో వున్న ఫొటో వుంది. విశేషం ఏమంటే మార్చి 18న ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెతో గడిపిన అందమైన క్షణాలను ఇలా ఫొటోలతో చెప్పారు. ఇలా ఇద్దరి నడుమ కొన్ని హ్యాపీ మూమెంట్స్ ని తారక్ ఫొటోస్ గా షేర్ చేసుకోగా అవి ఇపుడు వైరల్ అవుతున్నాయి. ఇదిలా వుండగా, దేవర జపాన్ లో ఈనెల 27న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. జపాన్ లో బాగా ఆదరణ పొందుతుందనే ధీమాను ఎన్.టి.ఆర్. ఇంటర్వూలో వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు