ఆయ‌న మెసేజ్ చూడ‌గానే... నాకు షాకింగ్‌గా అనిపించింది - ప్ర‌భాస్

సోమవారం, 12 ఆగస్టు 2019 (15:36 IST)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ సాహో. ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పైన వంశీ, ప్రమోద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ట్రైలర్‌కు ట్రైమండస్ రెస్పాన్స్ రావ‌డంతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.
 
ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ – “ట్రైలర్‌కి హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రేంజ్ రెస్పాన్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ట్రైలర్ చూడగానే మెగాస్టార్ చిరంజీవిగారు ట్రైలర్ బావుందంటూ మెసేజ్ చేశారు. అది నాకు షాకింగ్‌గా అనిపించింది. నేను ఆయనతో ఫోన్‌లో మాట్లాడాను. అదొక ఎక్స్‌టార్డినరీ ఫీలింగ్ కలిగింది. గూస్ బంప్స్ వచ్చాయి. 
 
నాకు క్రికెట్‌లో డిఫెన్స్ ఆడటం తెలియదు. లాగి కొట్టడమే తెలుసు. తగిలితే సిక్సరే. సిక్సర్ డైలాగ్‌కి ట్రైలర్‌లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. `బాహుబలి` తర్వాత చేస్తోన్న సినిమా కావడంతో మా యూనిట్‌పై ఒత్తిడి ఉంటుంది. అందుకే ప్రేక్షకులు, అభిమానులను ఎంటర్‌టైన్ చేయడానికి రాత్రి పగలు కష్టపడ్డాం. అందుకని కాస్త సమయం తీసుకునే చేశాం. క్వాలిటీ కోసం సుజిత్ అతని వయసుకు మించి కష్టపడ్డాడు. దర్శకుడుగా రెండో సినిమాకే ఇంతలా వర్క్ చేయడం అంత సులభమేమీ కాదు. 
 
శ్రీకర్ ప్రసాద్, సాబు సిరిల్, కమల్ కణ్ణన్ ఇలా దేశంలో పేరున్న సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పనిచేశారు. అలాగే చైనా, హాలీవుడ్ నుండి వచ్చిన సాంకేతిక నిపుణులు కూడా పనిచేశారు. నేను, నిర్మాతలు అయినా ఒత్తిడి ఫీలయ్యాం కానీ సుజిత్ ఒక్కసారి కూడా సెట్‌లో కోప్పడటం చూడలేదు. ఉదాహరణకు సినిమాలో ఒక సీన్ ఐదు వేరియేషన్స్‌తో వస్తుంది. చాలా టఫ్ సీన్. 8 లేయర్స్ ఉంటాయి. అలాంటి సన్నివేశాన్ని సుజిత్ తొలి రోజు చిన్న కరెక్షన్ లేకుండా తీయడం గొప్పగా అనిపించింది. 
 
రీషూట్స్ చేయాల్సిన అవసరం కూడా రాలేదు. అప్పుడే తనపై నమ్మకం కలిగింది. ట్రైలర్ విడుదల కంటే ముందు సుజిత్, అసిస్టెంట్ డైరెక్టర్ 137 కట్స్ చేశారు. సినిమా చూశాక.. ఇలాంటి ట్రైలర్‌ను కట్ చేయడం ఎంత కష్టమో ప్రేక్షకులకు అర్థమవుతుంది. కొత్త యాక్షన్ సీన్స్ ట్రై చేశాం. ట్రైలర్‌లో వచ్చే ట్రక్‌ సీన్‌ విఎఫ్‌ఎక్స్‌ కాదు. హలీవుడ్‌ ‘ట్రాన్స్‌పార్మర్స్‌’కి చేసిన స్పెషలిస్ట్‌ని ఆ సీన్‌ కోసం ప్రత్యేకంగా పిలిచాం. యాక్షన్ పార్ట్ కోసం నాతో పాటు శ్రద్ధా కూడా చాలా రిహార్సల్ చేసింది. తనొక సూపర్బ్ యాక్టర్. తెలుగులో తన డైలాగులను తనే చెప్పుకుంది. 
 
నేను, సుజిత్, టీమ్ మెంబర్స్ అయితే షాకయ్యాం. సాహోలో మంచి ప్రేమకథ ఉంటుంది. మా ప్రొడక్షన్‌ టీమ్‌ ఎడెనిమిది నెలలు ప్రిపరేషన్‌ వర్క్‌ చేశారు. ఇదొక యాక్షన్‌ లవ్‌స్టోరీ అని కూడా చెప్పొచ్చు. శ్రద్ధాది అంత ముఖ్యమైన పాత్ర. ట్రైలర్‌లో ఎక్కువ చూపించలేం. సినిమా చూస్తే తెలుస్తుంది.

ఆషికీ 2 వంటి లవ్ స్టోరీలో నటించిన శ్రద్ధాకపూర్ నటించిన యాక్షన్ సినిమాను చూడటానికి బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తన మంచి ఇన్‌టెన్స్ ఉన్న యాక్టర్. `సాహో`లో బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా కీలకపాత్ర పోషించనుంది. టీజర్‌ విడుదల కావడానికి పది రోజుల ముందు, మేం ఆ నేపథ్య సంగీతం విన్నాం. అందుకోసం 80 లేయర్స్‌ లైవ్‌ మ్యూజిక్‌ చేయించాడు. అందుకే, సౌండింగ్‌ కొత్తగా ఉంది“ అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు