వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్లీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై ట్విట్టర్లో స్పందించాడు. తాను ఎప్పుడూ తల్లిపై ఒట్టేయలేదని.. ఇక పవన్ గురించి కానీ.. మెగా ఫ్యామిలీ గురించి కానీ నెగటివ్‌గా మాట్లాడనని వర్మ.. పవన్‌పై మళ్లీ నోరెత్తాడు. తాజాగా పవన్ కళ్యాణ్, రవితేజని ఉద్దేశించి వర్మ చేసిన ట్వీట్స్ సంచలనంగా మారాయి. మాస్ మహా రాజా రవితేజ నటించిన నేలటిక్కెట్ ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పవన్ కళ్యాణ్, రవితేజ కలసి ఆడియో వేడుకలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. నేల టిక్కెట్టు ఆడియో వేడుకలో పవన్, రవితేజ పక్కపక్కనే కూర్చున్నారు. రవితేజ ధరించిన రగ్గుడ్ జీన్స్ ప్యాంటు ఆసక్తికరంగా కనిపించడంతో పవన్ కళ్యాణ్ రవితేజ ప్యాంటులోని చిరుగుళ్లను పరిశీలించారు. ఈ విషయాన్ని కూడా వర్మ వివాదం చేసే ప్రయత్నం చేశాడు. రవితేజ జీన్స్ తొడలపై పవన్ కళ్యాణ్ కనబరిచిన ఆసక్తి రెండు రాష్ట్రాలపై పెడితే సస్యశ్యామలమవుతాయని వర్మ సెటైర్ వేయడం సంచలనంగా మారింది.