- మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వ సాధారణం. ప్రజా సమస్యలను పక్కన పెట్టి దిగజారిపోయినట్లు నిన్న అసెంబ్లీ సాక్షిగా జరిగిన ఓ సంఘటన నన్ను కలచివేసింది.
- వ్యక్తిగత దూఫణలతో దిగజారుతున్నామో అనిపిస్తుంది. ముఖ్యంగా ఆడపడచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడే తీరు అచారక పరిణామాలకు దారితీస్తుంది. ఆడపడచులను గౌరవించడం మన సంప్రదాయం. అది మన రక్తంలోనే ఇమిడిపోయింది. రాబోయే తరానికి భాషను, సంప్రదాయాలను భద్రంగా అప్పగించాలి. కానీ మన సంక్రుతిని కాల్చివేసి అదే బంగారు బాట అనుకోవడం పెద్ద తప్పు.
- ఈ మాటలు నేను ఇలాంటి ఒక వ్యక్తిగత దూషణలు గురైనటువంటి కుటుంబ సభ్యుడిగా మాట్లాడడం లేదు. కొడుకుగా, భర్తగా, తండ్రిగా దేశ పౌరుడిగా మాట్లాడుతున్నాను. సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నాను.