హాలీవుడ్ నటీమణి బ్లాంకా బ్లాంకో ఆస్కార్ అవార్డుల వేడుకలో ధరించిన డ్రెస్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రపంచ సినీ రంగంలో అత్యున్నత పురస్కారాలుగా గుర్తింపు పొందిన ఆస్కార్ వేడుక జరుగుతున్న వేళ బ్లాంకా బ్లాంకో చీప్ పబ్లిసిటీ కోసం ప్రయత్నించిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రత్యేకంగా డిజైన్ చేసిన పసుపురంగు గౌనులో హాజరైన ఆమె లోదుస్తులు వేసుకోకుండా... రహస్యాంగాలు ప్రదర్శించి విమర్శల పాలైంది.
బ్లాంకా బ్లాంకో గౌన్ కట్ చాలా ఎక్కువగా ఉండడం, ఆమె లో దుస్తులు వేసుకోకపోవడం, అలాగే వివిధ యాంగిల్స్‌లో ఫోటోలకు ఫోజులివ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ గౌన్‌తో ఓ దశలో బ్లాంకో కూడా ఇబ్బంది పడింది. ఈ డ్రెస్‌పై సదరు హాలీవుడ్ నటి స్పందించింది. తాను ఆ రోజు నగ్నంగా లేనని, తన ప్రైవేట్ పార్ట్స్ బయటకు కనిపించాయనడం ఒట్టి పుకారేనని స్పష్టం చేసింది.