తమిళనాడు రాష్ట్రంలో వచ్చే 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తనను ముఖ్యమంత్రిని చేస్తే 150 యేళ్లు జీవించే రహస్య విద్యను చెబుతానని సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు, సినీ హీరో శరత్ కుమార్ ప్రకటించారు. మదురైలో జరిగిన ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో శరత్ కుమార్ మాట్లాడుతూ, మద్యం దేహాన్ని కుంగదీసి మానసిక ఒత్తిడిని కలుగజేస్తుందన్నారు. గంజాయి, గుట్కా తదితరాల వాడకం మనిషి పెరుగుదలను వేగంగా నియంత్రిందన్నారు.
2025 నాటికి అత్యధిక యువకులతో కూడిన దేశంగా భారత్ మారుతుందని గణాంకాలు చెబుతున్నాయని, దేశంలో యువశక్తిని నియంత్రించేందుకే విదేశాల నుంచి మత్తుపదార్థాలను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తెలిపారు. 69 ఏళ్ల వయసున్న తాను 150 ఏళ్ల వరకు జీవించేందుకు రహస్యాన్ని కనుగొన్నాని, 2026లో తనను ముఖ్యమంత్రిని చేయాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర్రంలో మద్యపాన నిషేధం అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.