గ్లామర్ అంటే చిట్ట పొట్టి దుస్తులు వేసుకున్నప్పడు హాట్‌గా కనిపించడం కాదు. చుడీదార్ వేసుకున్నా, బురఖా వేసుకున్నా సరే అందంగా కనిపించడమే తన దృష్టిలో గ్లామర్ అంటోంది నీలికురుల అమ్మాయి అనుపమా పరమేశ్వరన్. అందమైనా, అనాకారమైనా చూసే కళ్లను బట్టే ఉంటుంది. పాత్ర బాగుంటే గ్లామరస్‌గానే కాదు తలపైనుంచి కాళ్ల వరకు పారాడే బురఖా వేసుకోవడానికి కూడా నేను రెడీ అంటోందీమె.
గ్లామరస్ అంటే నా దృష్టిలో.. చిట్టి పొట్టి దుస్తులు వేసుకున్నప్పుడు హాట్‌గా కనిపించడం కాదు.. చుడీదార్ వేసుకున్నా అలా కనిపించడం. ఏదైనా సరే చూసే కళ్లను బట్టి ఉంటుంది. ఒకవేళ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే నేను బురఖా వేసుకుని యాక్ట్ చేయడానికి కూడా రెడీ. క్యారెక్టర్ బాగుంటే గ్లామరస్ డ్రెస్సులు వేసుకోవడానికి వెనకాడను అంటూ నిర్మాతలకే ఆ చాన్స్ వదిలేసింది అనుపమ.
పారితోషికం ఎక్కువ కాబట్టి తెలుగు సినిమాల్లోకి రాలేదని, డబ్బే ముఖ్యమైతే తమిళం, హిందీ ఏ భాషా చిత్రాలనయినా చేయవచ్చు కదా అన్నది అనుపమ. మంచిపాత్రలు వచ్చాయి కాబట్టి తెలుగులో చేస్తున్నానే తప్ప పారితోషికాని ప్రాధాన్యం ఇచ్చి సినిమాలను ఎన్నడూ ఒప్పుకోలేదనిసేంది. ఓ ఆర్టిస్ట్‌గా మంచి పాత్రలు చేయడానికి తపన పడుతుంటాను. ఒకవేళ ఇప్పుడు మంచి క్యారెక్టర్స్ చేయలేదనుకోండి.. పదేళ్ల తర్వాత ‘అయ్యో చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇన్నేళ్లు ఏం చేశాం’ అని బాధపడాల్సి ఉంటుంది. ఆ సంగతి పక్కన పెడితే, నేనిప్పటివరకూ పారితోషికానికి ప్రాధాన్యం ఇచ్చి సినిమాలు ఒప్పుకున్నది లేదు. ఇకముందు కూడా అంతే. అంటూ తన అభిప్రాయం స్పష్టం చేసింది అనుపమ.