దిలీప్‌తో మరో కొంతమంది లైంగిక వేధింపులు, అపహరణ కేసు విచారణను బదిలీ చేయాలని కేరళ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను మంగళవారం తోసిపుచ్చింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది జి ప్రకాష్ బాధితురాలిపై ప్రాసిక్యూషన్, వేధింపుల పట్ల పక్షపాత సంఘటనల కారణంగా ఈ కేసు విచారణ దెబ్బతిందని, న్యాయమైన విచారణ పొందడం బాధితురాలి హక్కు అని ఆయన ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారించిన సుప్రీం ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది. నటి కిడ్నాప్, దాడి కేసు విచారణ జరుగుతున్న కోర్టు న్యాయమూర్తిని మార్చాలని కేరళ ప్రభుత్వం చేసిన మనవిని సుప్రీం కోర్టు తిరస్కరించింది. కేసు విచారణ చేస్తున్న న్యాయమూర్తి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వాదించిన కేరళ ప్రభుత్వం తీరును సుప్రీం కోర్టు తప్పుపట్టింది.
ఈ ఆరోపణల్లో వాస్తవాలు లేవు. న్యాయమూర్తిని మార్చాలని చెప్పినంత మాత్రాన అలా చెయ్యడం సాధ్యం కాదు, మీ డిమాండ్‌లను దృష్టిలో పెట్టుకుని జడ్జిని మార్చడం సాధ్యం కాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది, అసలు మీరు ఏమనుకుంటున్నారు..?, మీ వాదలను మీరే సమర్థించుకుంటారా అంటూ సుప్రీం కోర్టు మండిపడుతూ కేరళ ప్రభుత్వం పిటిషన్‌ను కొట్టి వేసింది. ప్రముఖ నటి దాడి కేసు విచారణ చేస్తున్న న్యాయమూర్తిని మార్చాలని వెళ్లిన కేరళ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు చివాట్లు తప్పలేదు.