మూడు కత్తులతో సేనాపతి వాస్తున్నాడు - చెన్నైలొో ఆడియోకు రజనీకాంత్, శింబు

డీవీ

శుక్రవారం, 31 మే 2024 (17:16 IST)
Indian 2 team intites to kaml
కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్-2 గ్రాండ్ ఆడియో లాంచ్‌కి ఉలగనాయగన్ కు స్వాగతం పలుకుతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంటూ ఓ ఫొటో షేర్ చేసింది. అందులో మూడు కత్తులున్న తోలు సంచిను కమల్ కు ఇస్తూ ఇదే ఆహ్వానంగా తెలియజేసింది. రేపు అనగా శనివారంనాడు ఇండియన్-2 గ్రాండ్ ఆడియో చెన్నైలో సాయంత్రం ఆరుగంటలకు ప్రారంభం అవుతుందని తెలియజేసింది.
 
Senapati kniefs
ఈ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్, శింబు తదితరులు హాజరుకానున్నారు. 1996 లో వచ్చిన కల్ట్ మూవీ భారతీయుడు సినిమాకు సీక్వెల్ ఇది. తమిళంలో రూపొందింది. దానిని తెలుగులో డబ్ చేశారు. ఇప్పుడు కూడా తమిళంలో రూపొందుతోన్న ఈ సినిమాలో కమల్ హాసన్ మూడు కత్తులతో అవినీతిపరులను అంతమొందించే విధంగా ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది.
 
కాజల్ అగర్వాల్, సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, ఎస్.జె. సూర్య, ప్రియా భవానీ శంకర్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ బాణీలు సమకూరుస్తున్నారు. విజన్ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. జులై లో సినిమాను విడుదల చేయనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు