టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సరసన సీనియర్ నటి నయనతార నటించనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. మహేష్ బాబు- మురుగదాస్ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో.. ఈ చిత్రంలో నయనతార స్పెషల్ రోల్‌లో కనిపిస్తుందని సినీ వర్గాల్లో టాక్. ఫ్లాష్ బ్యాక్‌లో కనిపించే పాత్ర కోసం మురుగదాస్ నయనతార అయితే కరెక్ట్‌గా ఉంటుందని.. ఆమెను సెలక్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అయితే దీనికి సంబంధించి యూనిట్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా.. మహేష్ సరసన నయన రోల్ తప్పకుండా క్లిక్ అవుతుందని సినీ పండితులు అంటున్నారు. ఇప్పటికే బ్రహ్మోత్సవం ఫట్ తర్వాత మంచి హిట్ కోసం వేచి చూస్తున్న మహేష్ ఫ్యాన్స్.. ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. నయనతార ఈ సినిమాలో భాగం అయితే తప్పకుండా సినిమాకు హైప్ లభిస్తుందని ప్రిన్స్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కుతుండగా మహేష్ సరసన రకుల్ హీరోయిన్‌గా నటిస్తుంది.