తమిళ బిగ్‌బాస్ షోపై వ్యతిరేకత మొదలైంది. ఇప్పటికే సోషల్ మీడియాలో బిగ్ బాస్ షోకు వ్యతిరేకంగా పలు పోస్టులు, సైటైర్లు వెల్లువెత్తుతున్నాయి. కాగా విజయ్ టీవీలో ప్రసారం అయ్యే బిగ్ బాస్ షోను లెజెండ్ యాక్టర్ కమల్ హాసన్ నిర్వహిస్తున్నారు.
ఈ మేరకు చెన్నై పోలీస్ కమిషనర్ వద్ద హిందూ మక్కల్ కట్చి ఫిర్యాదును అందజేసింది. భారత సంస్కృతిని ఈ షో గంగలో కలుపుతుందని.. బిగ్ బాస్‌ను నిషేధించాలని హిందూ మక్కల్ కట్చి డిమాండ్ చేసింది. ఇంకా యాంకర్ కమల్ హాసన్‌తో పాటు ఆ షోలో పాల్గొనే నటీనటులను అరెస్ట్ చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. కాగా కమల్ హాసన్ నిర్వహించే బిగ్ బాస్ షో జూన్ 24 నుంచి ప్రారంభమైంది.