Dude: ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ సినిమాకి రిపీట్ ఆడియన్స్ వస్తున్నారా !

చిత్రాసేన్

శనివారం, 18 అక్టోబరు 2025 (17:55 IST)
Pradeep Ranganathan, Naveen Yarneni, Y Ravi Shankar
తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్.. లవ్ టుడే.. తో తెలుగులోనూ యూత్ కు దగ్గరయ్యాడు. ఇప్పుడు డ్యూడ్ అనే సినిమాను చేశాడు. తెలుగులోనూ నిన్న విడుదలైంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అయ్యారు.  మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు.ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొందని సక్సెస్ మీట్ నిర్వహించారు.
 
మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలుగులో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రదీప్ గారిని తెలుగు ఆడియన్స్ లో ఎంతగానో వోన్ చేసుకున్నారు. ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమాకు చాలా పెద్ద రన్ ఉండబోతుంది. సెకండ్ షో నుంచి సినిమాకి రిపీట్ ఆడియన్స్ ఉన్నారు. రాబోయే రోజుల్లో పెద్ద బ్లాక్ బస్టర్ నెంబర్స్ నమోదు అవుతాయి. మొదటి రోజు న్యూస్ షోకు 25 లక్షలు, మ్యాటీకి 30 లక్షలు, నైట్ షోకు 40 లక్షలు ఇలా పెరుగుతూ వస్తుంది. రాత్రి ఓ థియేటర్ లో చూస్తే, ప్రతి సీన్ ను ఓన్ చేసుకుంటున్నారు. తర్వాత సీన్ డైలాగ్ కూడా చెప్పేస్తున్నారు. అంటే రిపీట్ ఆడియన్స్ వస్తున్నారని అర్థమయింది. అంటూ క్లారిటీ ఇచ్చారు.
 
హీరో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ.. డ్యూడ్ ని ఇంత అద్భుతంగా రిసీవ్  చేసుకున్న ఆడియన్స్ కి కృతజ్ఞతలు. మీరందించిన ప్రేమ మర్చిపోలేనిది. డ్రాగన్ కంటే నాలుగైదు రెట్లు ఎక్కువ కలెక్షన్స్ డ్యూడ్ చేసిందని మా నిర్మాతలు చెప్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. దీనికి కారణం మా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్. తెలుగు లో అద్భుతంగా రిలీజ్ చేశారు. నన్ను యాక్సెప్ట్ చేసిన తెలుగు ఆడియన్స్ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. లవ్ టుడే డ్రాగన్ సినిమాలకి చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. ఇప్పుడు అంతకుమించిన ఆదరణ అభిమానం డ్యూడ్ సినిమాకి చూపించారు. 
 
తమిళనాడులో కూడా నా గత సినిమాలు కంటే ఎక్కువ రెస్పాన్స్ కలెక్షన్స్ డ్యూడ్ సినిమాకి వస్తున్నాయి. సినిమాని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్స్ లో ప్రేక్షకుల ఆనందం చూస్తుంటే చాలా జాయ్ ఫుల్ గా ఉంది. నాకు ఇంత మంచి సినిమా ఇచ్చిన డైరెక్టర్ కీర్తికి థాంక్యూ. సాయి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇంత అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు.
 
నిర్మాత నవీన్ యర్నేని, వై రవిశంకర్ మాట్లాడుతూ, ఆనందంతో  మేం చెప్పాల్సిన కలెక్లన్ల వివరాలు కూడా డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి చెప్పేశాడు. ఏదిఏమైనా చూడనివారు థియేటర్ లో సినిమా చూడండి అంటూ ముగించారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు