బాహుబలి చిత్రం అంటే రికార్డుల మోత గుర్తుకు వస్తుంది. ఈ చిత్రం 500 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిందని ఆమధ్య వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. మరి వచ్చిన వార్తలకు కట్టిన పన్నుకు తేడాలు వచ్చాయో ఏమోగానీ ఆదాయపు పన్ను అధికారులు ‘బాహుబలి’ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లపై ఇళ్లపై, ఆఫీసులపై దాడులు చేస్తున్నారు.
శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్‌లతో పాటు విశాఖపట్టణం, విజయవాడ, హైదరాబాద్ లోని డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. వీరి దాడుల్లో ఇప్పటివరకూ రూ. 50 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం 30 బృందాలు ఏక కాలంలో రంగంలోకి దిగి బెంబేలెత్తిస్తున్నట్లు సమాచారం.