''దేవదాస్'' స్మాల్ పెగ్.. అదేనండీ టీజర్ రెడీ..

గురువారం, 23 ఆగస్టు 2018 (17:36 IST)
అక్కినేని నాగార్జున, నాని కలిసి నటిస్తున్న సినిమా ''దేవదాస్''. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్నఈ చిత్రం తొలి టీజర్ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు విడుదల కానుంది. ఈ విషయాన్ని వైజయంతీ మూవీస్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ఈ సందర్భంగా దేవదాస్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లోనే టీజర్ రిలీజ్ సమయాన్ని తెలియజేసింది. 
 
ఇక దేవదాస్ సినిమాలో రష్మిక, ఆకాంక్ష నటిస్తున్నారు. ఈ మూవీలో దేవ్‌గా నాగార్జున నటిస్తుండగా.. దాస్‌గా నాని కనిపించనున్నారు. ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. మెలోడీ మాంత్రికుడు మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. సెప్టెంబర్ 27న దేవదాస్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు