కొనసాగుతోన్న 'జై లవ కుశ' జోరు.. 'శ్రీమంతుడు' రికార్డుకు చేరువలో....

బుధవారం, 11 అక్టోబరు 2017 (09:41 IST)
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం 'జై లవ కుశ'. ఈ చిత్రం కలెక్షన్లపరంగా దూకుడు కొనసాగుతోంది. దసరా పండుగకు విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్ళను సాధిస్తూ ముందుకు దూసుకెళుతోంది. 
 
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనేకాకుండా, అమెరికాలోనూ ఈ సినిమా అదే జోరును కొనసాగిస్తోంది. అమెరికాలో ఇంతవరకూ రూ.10.6 కోట్లను రాబట్టిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో రూ.57 కోట్ల షేర్‌ను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.77 కోట్ల షేర్‌ను సాధించిన ఈ సినిమా, రూ.150 కోట్ల గ్రాస్ వసూళ్లకు చేరినట్టు ఫిల్మ్ ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
 
టాలీవుడ్‌లో ఇంతవరకూ అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల్లో రూ.164 కోట్లను సాధించి 'ఖైదీ నెంబర్ 150' మొదటిస్థానంలో ఉండగా, రూ.156 కోట్లను రాబట్టి 'శ్రీమంతుడు' రెండో స్థానంలో వుంది. 'శ్రీమంతుడు' వసూళ్లకు చేరువైన 'జై లవ కుశ'.. ఆ రికార్డును అధిగమిస్తుందా.. లేదా? అనే ఆసక్తికరంగా మారింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు