అన్నతో మాట్లాడినా లింకులు పెట్టేస్తున్నారు.. రెండో పెళ్లి అంటూ ట్రోల్ చేస్తున్నారు... జాను వీడియో

ఠాగూర్

శుక్రవారం, 2 మే 2025 (19:02 IST)
ప్రముఖ డ్యాన్సర్ జాను లిరి ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఓ డ్యాన్స్ షోలో డ్యాన్సర్ జాను లిరిని ప్రముఖ కొరియోగ్రాఫర్, న్యాయ నిర్ణేతగా వ్యవహరించే శేఖర్ మాస్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఆ తర్వాత శేఖర్ మాస్టర్, జాను లిరిలపై ట్రోల్స్ మొదలయ్యాయి. వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
 
ఈ నేపథ్యంలో ఇటీవల శేఖర్ మాస్టర్ స్పందించి, తనకు జానుకు ఉన్న సంబంధంపై క్లారిటీ ఇచ్చారు. మహిళా డ్యాన్సర్ జాను విషయంలో తనని ఉద్దేశించి సోషల్ మీడియలా వస్తున్న కామెంట్స్ ఎంతగానో బాధిస్తున్నాయని పేర్కొన్నారు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా జాను లిరి కూడా స్పందించారు. తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశారు తన వ్యక్తిగత జీవితంపై రకరకాలైన వార్తలు రావడంపై ఆమె బోరున విలపిస్తూ ఎమోషనల్ అయ్యారు. ఆ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

 

నాకు రెండో పెళ్లి అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు: జాను

ఒక అన్నతో మాట్లాడినా లింకులు కడుతున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తట్టుకోలేకపోతున్నాను. ఒక అమ్మాయి జీవితంతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నారు?. ఇక నా జీవితం మీద నాకు ఇంట్రెస్ట్ లేదు..నేను చనిపోతే మీరే బాధ్యులు -… pic.twitter.com/K2aAYdPN4X

— ChotaNews App (@ChotaNewsApp) May 2, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు