వచ్చే వారం జవాన్ ట్రైలర్.. లీకైన నయనతార లుక్..

గురువారం, 6 జులై 2023 (16:39 IST)
Nayanatara
బాలీవుడ్ కండల వీరుడు షారుఖ్ ఖాన్ చిత్రం జవాన్ ట్రైలర్ వచ్చే వారం విడుదల కానుంది. ట్రైలర్ లాంచ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభం కాగా, తాజాగా నయనతార జవాన్‌లో ఆమె ఫస్ట్ లుక్ లీక్ అయ్యింది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అట్లీ దర్శకత్వంలో నయనతార షారుఖ్‌ఖాన్‌తో కలిసి జవాన్‌లో కథానాయికగా నటిస్తోంది. ఇందులో పింక్ పవర్ సూట్ ధరించి అదరగొట్టింది. 
 
బాలీవుడ్‌లో నయనతార అరంగేట్రం చేసిన చిత్రం జవాన్. తమిళ లేడీ సూపర్‌స్టార్‌తో పాటు, జవాన్‌లో విజయ్ సేతుపతి, సన్యా మల్హోత్రా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె అతిధి పాత్రలో నటిస్తుందని.. షారూఖ్ భార్యగా నటిస్తోంది. 
 
ట్రైలర్ వచ్చే వారం విడుదల కానుండగా, దానికి ముందు టీజర్ వచ్చే అవకాశం ఉందని సమాచారం. జవాన్ టీజర్‌ను చెన్నైలో లాంచ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జూలై 7 లేదా 15న జవాన్ ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశం వుందని తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు